సమాఖ్య వ్యవస్థ – The Federal System in India || Indian Polity Study Material And Practice Bits in Telugu
భారతదేశం లాంటి దేశాలకు సరిపడే ఉత్తమ సమాఖ్య నమూనా
1. విరుద్ధ సమాఖ్య
2. బేర సమాఖ్య
3. కేందీకృత సమాఖ్య
4. సహకార సమాఖ్య
2. భారత రాజ్యాంగం అనేది సమాఖ్య ఎందుకనగ అది ఒక
ద్వంద్వ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది అని ఈ కింది వారిలో ఎవరు అభిప్రాయం వ్యక్తీకరించెను?
1. ఐవర్ జెన్నింగ్స్
2. హెచ్.ఎం. సర్వాయి
3. కె.యం.ముల్టీ
4. డా.బి.ఆర్. అంబేద్కర్
3. ఈ కింది ఇచ్చిన సమాఖ్య సూత్రాలలో ఏవి భారత సమాఖ్యలో కనిపించవు?
ఎ. కేంద్రం & రాష్ట్రముల మధ్య న్యాయ వ్యవస్థను
విభజించటం.
బి. ఏదైన రాష్ట్రం తన ఇష్టం అనుసారం యూనియన్ నుండి
విడిపోయి యూనియన్ ను విచ్ఛిన్నం చేయలేవు.
సి. సమాఖ్య శాసన వ్యవస వ్యవస్థలోని ఎగువ సభలో
రాష్ట్రాలకు సమాన ప్రాతినిథ్యం
డి. సమాఖ్య ప్రభుత్వం కొత్త రాష్ట్రాలకు ఏర్పాటు చేయడం
ద్వారా భారత యూనియన్ పటమును తిరిగి చిత్రికరించగలదు.
1. ఎ మరియు బి
2. సి మరియు డి
3. ఎ,బి మరియు సి
4. బి,సి మరియు డి
4 రాష్ట్ర జాబితాలోని అంశముపై పార్లమెంటుకు చట్టం చేసే
అధికారం దేని కొరకు కల్పించబడింది?
1. అల్ప సంభ్వాకుల ప్రయోజనం
2. సంబంధిత రాష్ట్ర ప్రయోజనం
3. జాతీయ ప్రయోజనం
4. ప్రజా ప్రయోజనం
5. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ లో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాలను విభజించే మూడు జాబితాలు
పొందపరచబడినవి?
1. ఎనిమిదవ షెడ్యూల్
2. ఏడవ షెడ్యూల్
3. ఆరవ షెడ్యూల్
4. ఐదవ షెడ్యూల్
6. భారత సమాఖ్య చాలా దగ్గరగా ఈ కింది వాటిలో దేనిని
పోలి ఉంటుంది?
1. కెనడా
2. రష్యా
3. ఆస్ట్రేలియా
4.యూఎస్ఏ
7. సమాఖ్య అను పదం ఏమి సూచిస్తుంది?
1. అధికారాల సమ్మేళనం
2. అధికారాల సంక్రమింపు
3. అధికారాల వేర్పాటు
4. అధికారాల విభజన
8. భారత రాజ్యాంగానికి లోబడి అవశేష అధికారాలు వీరిలో
నిహితమై ఉన్నాయి?
1. న్యాయవ్యవస్థ
2. పార్లమెంట్
3. కార్య నిర్వాహక శాఖ
4. రాష్ట్ర శాసన సభలు
9. ‘సమాఖ్య’ అను పదం భారత రాజ్యాంగంలో ?
1. ఎక్కడ కనబడదు.
2. నిబంధన 368 కనబడుతుంది.
3. రాజ్యాంగ మూడవ భాగంలో కనబడుతుంది
4. ప్రవేశికలో కనబడుతుంది.
10. ఈ కింది వానిలోని ప్రభుత్వ స్థాయి మరియు శాసన
అధికారాల జతలలో ఏది సరిగా జతపరచబడలేదు?
1. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు – ఉమ్మడి జాబితా
2. స్థానిక ప్రభుత్వాలు – అవశేష అధికారాలు
3. కేంద్ర ప్రభుత్వం – కేంద్ర జాబితా
4. రాష్ట్ర ప్రభుత్వాలు – రాష్ట్ర జాబితా
11. “భారత రాజ్యాంగం ఏక కేంద్ర లక్షణాలు గల సమాఖ్య
రాజ్యం కాకుండా సమాఖ్య లక్షణాలు అనుబంధంగా గల ఏక కేంద్ర రాజ్యం అది దాదాపు అర్ధ సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసింది” అని ఉటంకించినది?
1. హెచ్.జె. లాస్కి 2. కే.సి.వేర్
3. హెచ్ఎం. సర్వాయి
4. ఐవర్ జెన్నింగ్స్
12. ఈ కింది వాటిలో ఏది/ ఏవి సమాఖ్య రాజ్య లక్షణాలు? ఎ. కేంద్ర మరియు రాష్ట్ర (అంతర్భాగం) ప్రభుత్వాల యొక్క
అధికారాలు స్పష్టంగా పేర్కొనబడింది.
బి. ఇది ఒక అలిఖిత రాజ్యంగమును కలిగి ఉంటుంది.
కోడ్స్ :
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ మరియు బి
4. ఎ & బి కాదు
13. రాష్ట్ర జాబితాలోని ఒక విషయంపై ఎప్పుడు పార్లమెంట్
శాసనమును రూపొందించును?
1. ఒకవేళ రాష్ట్రపతి ఆ విషయమును రాష్ట్ర జాబితా నుండి
కేంద్ర జాబితా లేదా ఉమ్మడి జాబితాకు బదిలీ చేస్తూ అధ్యాదేవంను జారీ చేసినప్పుడు
2. ఒక వేళ పార్లమెంట్ ఆ కార్యం జాతీయ ప్రయోజనం
కొరకు అని తీర్మానం చేసినపుడు
3. ఒకవే సుప్రీంకోర్టు, పార్లమెంట్ కు కావలసిన
అధికారంను మంజూరు చేసినపుడు
4. ఒక వేళ రాజ్యసభ పరిశీలనలో ఉన్న రాష్ట్ర జాబితాలోని
విషయమును జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉందని ప్రకటిస్తూ ఒక తీర్మానమును ముడింట రెండువంతుల అధికంలో ఆమోదించినపుడు
14. భారత రాజ్యాంగం సమాఖ్య లక్షణంను కలిగి ఉంది
ఎందుకనగా?
1. కేంద్రం & రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ జరుగుతుంది.
2. రాజ్యాంగంలో పొందపరిచిన విధానంను అను సరించడం ద్వారా మాత్రమే రాజ్యాంగ సవరణ చేపడతారు మరియు కొన్ని సందర్భాలలో సవరణ రాష్ట్రాల శాసన సభలతో
అనుమోదం పొందాల్సి ఉంటుంది.
3. రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతిచే నియమించ బడతారు మరియు ఆ పదవిలో రాష్ట్రపతి అభిష్టంను చూరగొన్నంత కాలం మాత్రమే కొనసాగుతారు.
4. రాజ్యా ధిపతి (రాష్ట్రపతి), పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో కూడిన ఒక నియోజక గణం ద్వారా ఎన్నుకోబడతారు.
Download pdf