General Science Biology Model Practice Bits & PDF in Telugu || Shine India General Science model Paper in Telugu

జనరల్ సైన్స్ – బయాలజీ

1) క్రింది వానిలో ఏది పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులలో ఒకటి కాదు
1.మెరాస్మెస్
2.ఎనీమియా
3.ప్రెస్ బయోపియా
4.గాయిటర్

Answer : 3

2) కీటకాలలో
ఎ) కొరికి నమిలే రకపు జీవులు – బొద్దింక, చీమ, పట్టుపురుగు
బి) చూషక రకపు జీవులు – ఈగలు
సి) సైఫనింగ్ రకపు జీవులు – లక్క, దోమ, నల్లి, పేను సరియైనది (వి) ఎంచుకోండి
1. ఎ, బి మాత్రమే
2. బి, సి మాత్రమే
3. ఎ, సి మాత్రమే
4. ఎ, బి మరియు సి

Answer : 1

3) పోర్టర్ సిర అనేది
1.చిన్న ప్రేగు నుంచి పెద్ద ప్రేగుకు రక్తాన్ని ఆహారాన్ని సరఫరా చేసే సిర
2.చిన్న ప్రేగు నుంచి కాలేయమునకు రక్తాన్ని ఆహారాన్ని సరఫరా చేసే సిర
3.పెద్ద ప్రేగు నుంచి మూత్రపిండాలకు ఆహారాన్ని, రక్తాన్ని సరఫరా చేసే సిర
4.పెద్ద ప్రేగు నుంచి హృదయమునకు రక్తాన్ని, ఆహారాన్ని సరఫరా చేసే సిర

Answer : 2

4) గుండెలోని ఏ భాగంలోని రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది?
1.కుడి కర్ణిక, కుడి జఠరిక
2.కుడి జఠరిక, ఎడమ జఠరిక
3.ఎడమ కర్ణిక, కుడి కర్ణిక
4.ఎడమ జఠరిక, కుడి కర్ణిక

Answer : 1

5) ఫ్లూ (ఇన్ ఫ్లూయెంజా) కు సంబంధించిన విశేషాలను పరిశీలించండి.
ఎ) ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి
బి) ఫ్లూ వైరస్ వల్ల సోకుతుంది.
సి) రాబర్ట్ వెబ్బ్బర్ ఈ వైరస్ ను తొలిసారి గుర్తించారు సరియైనది (వి) ఎంచుకోండి
1. ఎ, బి మాత్రమే
2.బి, సి మాత్రమే
3. ఎ, సి మాత్రమే
4. ఎ, బి మరియు సి

Answer : 4

6) ‘శాస్త్ర పరిజ్ఞానంలో అనువంశికతా శాస్త్రమే జన్యు శాస్త్రము’ అన్నది
1.గ్రెగర్ మెండల్
2.సి కోరెన్స్
3. హెచ్ జె ముల్లర్
4. డబ్ల్యూ బేటన్స్

Answer : 4

7) క్రిందివాటిలో సరియైన వాక్యమును ఎంచుకోండి?
ఎ)కేసరావళి, అండకోశం రెండూ వుండే పుష్పాలను ఏకలింగపుష్పాలు అంటారు
బి)కేసరావళి, అండకోశంలలో ఏదో ఒకటి మాత్రమే వుండే పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు
సి)కేసరావళి, అండకోశంలలో ఏదో ఒకటి మాత్రమే వుండే పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు.
1.ఎ,సి సరైనవి
2.ఎ,బి,సి సరైనవి
3.సి మాత్రమే సరైనది
4.ఎ,బి సరైనది

Answer : 3

8) మాత్రికలో పసుపు పచ్చని తంతువులును కలిగియుండటమనే లక్షణమును కలిగి, చెవిదొప్ప, యుస్టాచియన్ గొట్టంలలో కనిపించే కణజాల తంతువులను క్రింది వానిలో గుర్తించండి
1.హయలీన్ మృదులాస్థి
2.తెలుపు తంతుయుత మృదులాస్థి
3.స్థితిస్థాపక మృదులాస్థి
4.కాల్షియం మృదులాస్థి

Answer : 3

9) క్యాన్సర్ అను వ్యా ధి ప్రాణాంతకమైనది. ఎందుకనగా అది అసహ్యమైన సంభావ్యతను కలిగియున్నది. అందులో
1.సామన్య కణజాలానికి లేదా అవయవానికి ఎటువంటి పోలికయుండలేదు
2.కణాలు చాలా వేగంగా విభజన చెంది ట్యూమర్ ను ఏర్పరచును
3.శరీరంలో ముఖ్య అవయవాలను వ్యాపించును
4.కణాలు చాలా పెద్దవిగా గాని లేదా చాలా చిన్నవిగా గాని కన్పించును

Answer : 3

10) క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ) అస్థిగహనం కపాలంలోని ఎముకలలో ఉంటుంది.
బి) త్వచాగహనము అంతర లసికా ద్రవముతో నిండి ఉంటుంది. సరియైన సమాధానం ఎంచుకోండి
1. ఎ సరియైనది, బి సరియైనది
2. ఎ సరియైనది, బి సరికానిది
3. ఎ సరికానిది, బి సరికానిది
4. ఎ సరికానిది, బి సరియైనది

Answer : 1

11) రొయ్యలు, పీతలలో విసర్జక అవయవాలను గుర్తించండి
1.సంకోచ రిక్తికలు
2.జ్వాలాకణాలు
3.నెఫ్రీడియా
4.హరిత గ్రంధులు

Answer : 4

12) ఈ క్రింది వాటిలో “జీడిమామిడి” మొక్క శాస్త్రీయ నామం ఏది?
1.అనకార్డియం ఆక్సిడెంటాలిస్
2.అనోన స్క్వా మోజ
3.ఫైకస్ బెంగాలిన్సిస్
4.కెమెల్లియా సైనన్సిస్

Answer : 1

13) కప్పలు, సాలమాండర్స్ వంటి జీవులు ఈ వర్గానికి చెందును
1.ఫిషెస్
2.రెప్టెల్స్
3.ఆంబీబియన్స్
4.ఏవ్స్

Answer : 3

14) క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ) మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకము కార్బన్ ఒకేంద్రకముల సంఖువ్యము ,
బి) మానవ శరీరంలో అధికంగా ఉండే లోహ మూలకము కాల్షియం
సి) మానవ శరీరంలో అధికంగా ఉండే వాయు మూలకం ఆక్సిజన్ సరియైనది (వి) ఎంచుకోండి
1. ఎ, బి మాత్రమే
2. బి, సి మాత్రమే
3. ఎ, సి మాత్రమే
4. ఎ, బి మరియు సి

Answer : 4

15) మృతుని వేలుగా పిలువబడే స్పంజికలను క్రింది వానిలో గుర్తించండి
1.యూస్పాంజియా
2.యూఫెక్టిల్లా
3. క్లయోనా
4.కాలినా

Answer : 4

16) వాస్తవానికి, సమవిభజన అంటే?
1.కణజీవద్రవ్యము విభజన మాత్రమే
2.కేంద్రకము విభజన మాత్రమే
3.క్రోమోజోముల సంఖ్యను తగ్గించుట
4.కేంద్రకము, కణజీవ ద్రవ్యము రెండింట విభజన

Answer : 4

17) గ్రిసియో ఫుల్విన్ అనే శిలీంధ్రము ఈ వ్యాధుల నుంచి రక్షణకై ఉపయోగిస్తారు
1.టైఫాయిడ్, కోరింతదగ్గు
2.వైరస్ వ్యాధులు
3.న్యూమోనియా, బ్రాంఖైటిస్
4.రింగ్ వార్మ్, యాంటీ ఫంగల్

Answer : 4

18) మిర్శికాలజీ అనేది చీమలకు సంబంధించిన అధ్యయనం అయితే ఏకరాలజీ అనేది
1.లిపిడ్స్ కు సంబంధించిన అధ్యయనం
2.పందులకు సంబంధించిన అధ్యయనం
3.పేలకు సంబంధించిన అధ్యయనం
4.నల్లులకు సంబంధించిన అధ్యయనం

Answer : 4

19) కొందరిలో చర్మం పై పొర పొలుసులు పొలుసులుగా ఊడిపోతూ ఉంటుంది. ఈ తరహా వ్యాధిని డెర్మటోసిస్ గా వ్యవహరిస్తుంటారు. అయితే ఈ వ్యాధి రావడానికి కారణం ఏ విటమిన్ లోపం?
1. విటమిన్ ఎ
2. విటమిన్ డి
3. విటమిన్ ఇ
4. విటమిన్ కె

Answer : 1

20) క్రింది వానిలో భారత్ లో సెల్ టవర్ వికిరణం వల్ల బాగా ప్రభావితం అయిన పక్షి ఏది?
1.చిలుక
2.పావురం
3.కాకి
4.పిచ్చుక

Answer : 4

21) టీరో కార్పస్ : ఎర్ర చందనం : : సాంటాలమ్ ఆల్బా
1. టేకు చెట్లు
2. సాల్ వృక్షాలు
3. వేప చెట్లు
4. గంధం వృక్షాలు

Answer : 4

22) ఏ ఋతువులో క్రొవ్వు పదార్ధము అధికముగా ఉండే ఆహారము అవసరం అవుతుంది?
1.వర్షరుతువు
2.చలికాలము
3.వసంతరుతువు
4.వేసవిరుతువు

Answer : 2

23) క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ) పూర్వ మహాసిర తల మెడ, చేతుల నుండి రక్తాన్ని
సంగ్రహించును. బి) పర మహాసిర మొండెము, కాళ్ల నుంచి రక్తాన్ని
సంగ్రహించును. సి) సిరలలన్నింటిలోనూ పెద్దది పూర్వ మహాసిర సరియైనది (వి) ఎంచుకోండి ,
1. ఎ, బి మాత్రమే
2. బి, సి మాత్రమే
3. ఎ, సి మాత్రమే
4.ఎ, బి మరియు సి

Answer : 1

24) క్రింది వానిలో ఏది వృక్ష కణాలలో ఉంటుంది కానీ జంతు కణాలలో ఉండదు?
1.కణ కవచము
2.రిక్తికలు
3.ప్లాస్మా పొర
4.గాల్టీ సంక్లిష్టాలు

Answer : 1

25) డైయూరియా లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్ వ్యాధి యొక్క లక్షణము
1.మూత్రము జరుగకపోవడం
2.మూత్రము ఎరుపు రంగుకు మారడం
3.మూత్రము పసుపు రంగుకు మారడం
4.మూత్రము అధికముగా విసర్జితం కావడం

Answer : 4

Download pdf