1991 నూతన ఆర్థిక సంస్కరణలు నియంత్రణ సంస్థ ఏర్పాటు – 1991 Establishment of the New Economic Reforms Regulatory Agency Indian Economy Model Paper – 1

1. ప్రభుత్వ ప్రైవేటు రంగాలు కలిసి పని చేయడం అనేది ఏ ఆర్థిక వ్యవస్థలో గోచరించును?

1. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ.
2. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ.
3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ.
4.1 & 3

Answer : 3

2 ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
ఎ.మన దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు 1948 పారిశ్రామిక విధాన తీర్మానం నాంది పలికినది.
బి. 1991 నూతన పారిశ్రామిక విధానం మన దేశంలో మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడినది.
1.ఎ మాత్రమే
2.బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి.
4. ఏదీకాదు.

Answer : 3

మన దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి?
1. 1991, Aprill
2. 1991, June5
3. 1991, July 1
4. 1991, July24

Answer : 4

1991 నూతన ఆర్థిక విధానంలో తీసుకున్న ముఖ్యమైన చర్యలకు సంబంధించి సరైనది? ఎ.స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు.
బి. నిర్మాణాత్మక సరుబాటు చర్యలు.
1. ఎ మాత్రమే
2.బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి.
4. ఏదీకాదు.

Answer : 3

1991, July 24 నుండి చేపట్టిన ఆర్థిక సంస్కర ణల ముఖ్య ఉద్దేశ్యానికి సంబంధించి సరైనది?
ఎ. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం, ఉత్పాదకతను పెంచడం.
బి. ప్రభుత్వ రంగంను విశేషంగా ప్రోత్సహించడం.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి.
4. ఏదీకాదు

Answer : 1 

6. మన దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రధాని & ఆర్థిక మంత్రులు ఎవరు?
1. రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్.
2. ఇందిరాగాంధీ
3.పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్.
4, మన్మోహన్ సింగ్, ప్రణబ్. ముఖర్జీ

Answer : 3

1991 నాటి భారత ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణా లలో కానిదేది?
1. అత్యల్ప వృద్ధిరేటు
2. అధిక ద్రవ్యోల్బణం
3. అధిక కోశ లోటు.
4. విదేశీ మారక ద్రవ్యంలో మిగులు.

Answer : 4

8. 1991 సంలో మన దేశంలో తక్షణం ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడానికి దోహదం చేసిన ప్రధాన కారణం?
ఎ.విదేశీ మారక నిల్వలు కనిష్ఠ స్థాయికి పడిపోవడం.
బి. విదేశీ చెల్లింపుల సమస్యను అధికమించడం కోసం దేశ బంగారంను తాకట్టు పెట్టాల్సి రావడం.
సి. ఆర్థిక వ్యవస్థలో పోటీ వాతావరణంను పెంపొందించడం.
1. ఎ మాత్రమే
2. బి.సి లు మాత్రమే
3. ఎ,బి లు మాత్రమే
4. ఎ,బి,సి

Answer : 3

9. 1991 నూతన ఆర్థిక విధానం ముఖ్య లక్ష్యాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి?
ఎ.ఆర్థిక వ్యవస్థలో పోటీ వాతావరణంను పెంపొందించడం
బి. విదేశీ వ్యాపారంను ప్రోత్సహించడం.
సి. BOP లో కరెంట్ అకౌంట్ లోటును పెంచడం.
డి. ప్రభుత్వ రంగ పరిధిని కుదించడం.
1. ఎ,బి మాత్రమే
2. బి,సి,డి మాత్రమే
3. ఎ,బి,డి మాత్రమే
4. ఎ,బి,సి,డి

Answer : 3

10. 1991 నూతన ఆర్థిక విధానంలో భాగంగా చేపట్టిన నిర్మాణాత్మక చర్యలలో సరైన దానిని గుర్తించుము?
ఎ.పారిశ్రామిక విధాన సంస్కరణలు.
బి. ప్రభుత్వ సంస్కరణలు
సి. ప్రయివేటీకరణ సంస్కరణలు.
డి. విదేశీ వాణిజ్య సంస్కరణలు.
1. ఎ,సి మాత్రమే .
2. ఎ,సి,డి మాత్రమే
3. ఎ,బి,సి మాత్రమే
4. ఎ,బి,సి,డి

Answer : 4

11. 1991 నూతన ఆర్థిక విధానంలో భాగంగా చేపట్టిన స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలలో సరైనది
ఎ.అధిక ద్రవ్యోల్బణంను నియంత్రించడం.
బి. BOPలో కరెంట్ అకౌంట్ లోటు సమస్యను తొలగించడం.
సి. కోశ లోటును నియంత్రించడం.
డి. సామాజిక రంగ విధానాలు.
1. ఎ,సి మాత్రమే
2. ఎ,బి మాత్రమే
3. ఎ,బి,సి మాత్రమే
4. ఎ,బి,సి,డి మాత్రమే

Answer : 4

12. 1991 నూతన ఆర్థిక విధానం ముఖ్య లక్ష్యాలలో కానిది ?
1. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం.
2. పారిశ్రామిక లైసెన్సుల జారీలో కఠిన నిబంధనల ను విధించడం
3. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం. .
4. కోశ లోటును తగ్గించడం

Answer : 2

13 ఈ క్రింది వాటిలో సరైన స్టేట్ మెంట్సను గుర్తించండి?
ఎ. 1991 నూతన ఆర్థిక విధానంలో భాగంగా ఆర్థిక . వ్యవస్థలో నెలకొన్న అడ్డంకులను తొలగించడానికి నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలను చేపట్టారు.
బి. నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు స్వల్పకాలానికి సంబంధించినవి.
సి. 1991 నూతన ఆర్థిక విధానంలో భాగంగా ఆర్థిక ఈ వ్యవస్థలో నెలకొన్న అడ్డంకులను తొలగిండానికి స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలును చేట్టారు. డి. నిర్మాణాత్మక చర్యలు ధీర్ఘకాలానికి సంబంధించినవి.
1. ఎమాత్రమే
2. ఎ,బి మాత్రమే
3. ఎ,డి మాత్రమే
4. సి,డి మాత్రమే

Answer : 3

14. ఈ క్రింది స్టేట్మెంట్స్ లో సరైనది?
ఎ. 1980 దశకం ప్రారంభంలో (GDPలో శాతంగా) ద్రవ్యలోటు 6.3 శాతం.
బి. 1980 దశకం చివరి నాటికి (GDPలో శాతంగా) ద్రవ్యలోటు 8.2 శాతంనకు పెరిగినది.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి.
4. ఏదీకాదు

Answer : 3

15. 1991 సం నాటికి కేంద్ర ప్రభుత్వ రెవెన్యూలో ఎంత శాతంను వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేయాల్సి వచ్చినది?
1. 25 శాతం
2. 30 శాతం
3. 37 శాతం
4. 63 శాతం

Answer : 3

16. 7వ పంచవర్ష ప్రణాళికాంతానికి (1990) వర్తకపు లోటు?
1. 1,7,610 కోట్లు
2. 22,114 కోట్లు
3. 25,317 కోట్లు
4. 37,612 కోట్లు

Answer :2

17. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
ఎ. 1980 – 81 లో GDP లో రుణాల శాతం 35 శాతం.
బి. 199091 నాటికి GDP లో రుణాల శాతం 53 శాతం.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి.
4. పైవన్నీ.

Answer :3

18. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
1. 1990 – 91 సంలో మన దేశ రెవెన్యూ లోటు (GDP లో శాతంగా) 3.3 శాతం
2. 199091 సంలో మన దేశ కోశలోటు (GDP లో శాతంగా) 3.4 శాతం.
3. 199091 సంలో మన దేశ ప్రాథమిక లోటు (GDP లో శాతంగా) 2.8శాతం.
4. పైవన్నీ.

Answer :4

19. 2015 – 16 భారత ఆర్థిక సర్వే ప్రకారం ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైన దానిని గుర్తించుము
1. 201516 సంలో మన దేశ ద్రవ్యలోటు (GDP లో శాతంగా) 3.9
2. 2015-16 సంలో మన దేశ రెవెన్యూ లోటు (GDP లో శాతంగా) 2.8 శాతం
3. 2015-16 సంలో మన దేశ ప్రాథమిక లోటు (GDP లో శాతంగా) 0.7 శాతం.
4. పైవన్నీ

Answer :4

20. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
1.WPI (Whole Sale price Index) పరంగా 1985 – 86 సంలో ద్రవ్యోల్బణ శాతం 4.5 శాతం
2. 1990 – 91 నాటికి మన దేశంలో ద్రవ్యోల్బణం 10 శాతంనకు చేరినది.
3. 2015 – 16 April Jan మధ్య కాలంలో టోకు ధరల సూచీ (WPI) ద్రవ్యోల్బణం 2.8 శాతంగా ఉంది.
4. పైవన్నీ

Answer :4

21. మన దేశంలో ద్రవ్య విధానం పని తీరుపై చక్రవర్తి కమిటీని ఏ సం నియమించారు?
1. 1982
2. 1985
3. 1991
4. 1992

Answer :1

22. మూలధన ఖాతాలో (CAC) రూపాయి మార్పిడికి సంబంధించి సాధ్యా సాధ్యాలను పరిశీలించేం దుకు 1997 సం లో ప్రభుత్వం నియమించిన కమిటీ?
1. గోయి పోరియా కమిటీ.
2. సుఖమోయ్ చక్రవర్తి కమిటీ.
3. S.S.తారాపోర్ కమిటీ.
4. పద్మనాభన్ కమిటీ.

Answer : 3

23. భారత విత్తవ్యవస్థ నిర్మాణాన్ని,పని తీరును పరిశీలించ డానికి నరసింహాం కమిటీని ఏ సంలో “ప్రభుత్వం నియమించినది?
1. 1990, April
2. 1991, Aug
3. 1991, Sept
4. 1992, Nov

Answer : 2

24. 1998 లో బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను సూచించడానికి నియమించడిన కమిటీ?
1. M.నరసింహాం కమిటీ
2. పద్మనాభన్ కమిటీ
3. రాజాచెల్లయ్య కమిటీ
4. గీతాకృష్ణన్ కమిటీ

Answer : 1

25. మూలధన ఖాతాలో (CAC) రూపాయి మార్పిడికి సంబంధించి 2వ సారి S.S.తారాపోర్ కమిటీ ని ఎప్పుడు నియమించారు?
1. 2000
2. 2002
3. 2006
4. 2008

Answer : 3

26, 2వసారి నియమించబడిన S.S.తారాపోర్ కమిటీ మూలధన ఖాతా (CAC)లో రూపాయి మార్పిడి ని ఎన్ని దశలలో అమలు పరచవలెనని సూచిం చినది?
1. 2 దశలు .
2. 3 దశలు
3. 4 దశలు
4, 5 దశలు

Answer :2

27. BSRB ని ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేసినది?
1. 1991-92
2. 1995-96
3. 2001 – 02
4. 2005 – 06

Answer : 3

28. 2వ సారి 2006లో నియమించబడిన S.S. తారా పోర్ కమిటీ మూలధన ఖాతా (CAC) లో రూపాయి మార్పిడిని 3 దశలలో అమలు పరచ వలెనని సిఫార సు చేసినది ఆ మూడు దశలకు సంబంధించి సరైన దానిని గుర్తించుము?
1. మొదటి దశ 2006 – 07
2. రెండవ దశ 2007-09
3. మూడవ దశ 2009-11
4. పైవన్నీ

Answer : 4

29. 1995 లో బ్యాంకుల పనితీరు పై ప్రత్యక్ష పరిశీలన, పర్యవేక్షణ కొరకు ప్రభుత్వంచే నియమించ బడిన కమిటీ ?
1. M.నరసింహాం కమిటీ
2. పద్మనాభన్ కమిటీ
3. గోయి పోరియా కమిటీ
4. ఖాన్ వర్కింగ్ గ్రూప్

Answer : 2

30. ఆస్థుల పునర్నిర్మాణ నిధిని ఏ సం1లో ఏర్పాటు చేశారు ?
1. 1991
2. 1995
3. 2000
4. 2002

Answer : 4

31. మన దేశంలో వాణిజ్యన్ని పెంపొందించడానికి వీలుగా లిబరలైజ్డ్ ఎక్చేంజ్ రేట్ మేనేజ్ మెంట్ (LERM) విధానంను ఎప్పుడు ప్రకటించారు?
1. 1991, April
2. 1992, Feb
3. 1995, Dec
4. 1996, Jan

Answer : 2

32. మొదటిసారిగా ఏ బడ్జెట్లో కరెంట్ అకౌంట్ లో రూపా యిని పూర్తిగా మార్చుకునే అవకాశం కల్పించారు ?
1. 1991 – 92
2. 1992-93
3. 1993944,
4. 1994 – 95

Answer : 4

. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి?
1. బ్యాంకుల పనితీరును మెరుగుపరచి, ఖాతాదారు ‘లకు మెరుగైన సేవలను అందించేందుకు గోయి పోరియా కమిటీని నియమించారు.
2. ప్రభుత్వ రంగంలోని బలహీన బ్యాంకులను పునర్వ్యవస్థీకరించుటకు వర్మ కమిటీని నియమించారు.
3. అభివృద్ధి విత్త సంస్థలను, బ్యాంకులను సమన్వయ పరుచుటకు ఖాన్ వర్కింగ్ గ్రూప్ కమిటీ (1998) నియమించారు.
4. పైవన్నీ

Answer : 4

34. మనదేశంలో ఏ కమిటీ సిఫారసు మేరకు 1986సం లో కోశలోటును ప్రవేశపెట్టారు?
1. S.S.తారాపోర్ కమిటీ
2. M.నరసింహాం కమిటీ
3. రాజచెల్లయ్య కమిటీ .
4. సుఖమోమ్ చక్రవర్తి కమిటీ

Answer :4

35. ప్రభుత్వం యొక్క సమగ్రమైన లోటు కొలమానం
1. ప్రాథమిక లోటు
2. రెవెన్యూలోటు
3. కోశలోటు
4. ఏదీకాదు

Answer :3

36. కోశలోటును నియంత్రించుటకు FRBM చట్టంను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1, 1992
2. 1995
3. 2003
4. 2005

Answer :3

37. ప్రభుత్వం ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించడానికితగు సూచనలు చేయడానికి ఎవరి ఆధ్వర్యంలో వ్యయ సంస్కరణల కమీషన్ ను ఏర్పాటు చేసినది
1. రాజాచెల్లయ్య కమిటీ
2. గీతా కృష్ణన్ కమిటీ
3. రాఘవన్ కమిటీ
4. పటేల్ కమిటీ

Answer : 2

38. 1991 నూతన ఆర్థిక సంస్కరణలలో భాగంగా ధరల విధానంలో చోటు చేసుకున్న ప్రధాన మార్పులుకు సంబంధించి సరైన స్టేట్ మెంటు గుర్తించండి?
ఎ. బడ్జెట్ సబ్సీడీలు తగ్గించడం.
బి. ప్రాతినిధ్యం గల వస్తువుల ధరలు పెంచడం.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి.
4. ఏదీకాదు

Answer :3

39. నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రూపాయి మార్పిడికి సంబంధించి తీసుకున్న చర్యలలో సరైన దానిని గుర్తించండి?
ఎ. 1993 – 94 సం బడ్జెట్ లో ట్రేడ్ అకౌంట్ లో రూపాయిని పూర్తిగా మార్చుకునే అవకాశం
కల్పించారు.
బి. 1994-95 సం బడ్జెట్లో కరెంట్ అకౌంట్ లో రూపాయిని పూర్తిగా మార్చుకునే అవకాశం కల్పించారు.
1.ఎ మాత్రమే
2.బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి.
4. ఏదీకాదు

Answer :3

40. 1991 నూతన ఆర్థిక విధానంలో భాగంగా వర్తక విధానంలో చేపట్టిన సంస్కరణలలో కానిదేదో గుర్తించండి?
1. దిగుమతుల సరళీకరణ
2. దిగుమతుల సుంకాల పెంపు
3. పరిమాణాత్మక ఆంక్షలను పూర్తిగా తొలగించడం.
4. 1991లో రూపాయి మూల్యహీనీకరణ

Answer :2

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now