కేంద్ర రాష్ట్ర సంబంధాలు & అత్యవసర నిబంధనలు || Central State Relations & Emergency Regulations

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF

All the Best….

indian polity -13 కేంద్ర రాష్ట్ర సంబంధాలు

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF

All the Best….

1. ఒక అంతర రాష్ట్ర మండలిని దీని ద్వారా ఏర్పాటు చేయవచ్చును?
1. రాష్ట్రపతి
2. పార్లమెంట్
3. జోనల్ మండలి
4.జాతీయ అభివృద్ధి మండలి

2. ఈ కింది వానిలో ఎవరు అంతర-రాష్ట్ర మండలి సభ్యులు?
1. రాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్ర పాలిత ప్రాంతాలు పరిపాలకులు
2. ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులు.
3. ప్రధానమంత్రి లోకసభలో ప్రతిపక్ష నాయకుడు మరియు రాజ్యసభ అందరూ సభ్యులు.
4. ప్రధానమంత్రి, ఆరుగురు కేంద్ర కేబినెట్ మంత్రులు మరియు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు / కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలకులు.

3. జోనల్ మండళ్లపై ఈ కింది వ్యాఖ్యలలో ఏవి సరియైనవి?
ఎ. వాటి మనుగడకు అవి భారత రాజ్యాంగమునకు ఋణపడి ఉన్నవి.
బి. అవి రాష్ట్రాల పునర్విభజన చట్టం, 1956కు లోబడి ఏర్పాటు చేయబడినవి.
సి. ఐదు జోనల్ మండలిలు కలవు
డి. రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాల మరియు భారత ప్రభుత్వ, ప్రభుత్వాల మధ్య సంబంధాలను సమన్వయ పరుస్తాయి.
1. ఎ,బి మరియు సి
2. బి మరియు డి
3. సి మరియు డి
4. బి,సి మరియు డి

4. ఈ కింది వానిలో ఎవరి పరిపాలన కాలంలో అంతర రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు?
1. 1975లో కాంగ్రెస్ ప్రభుత్వం
2. 1990లో జనతాదళ్ – నేతృత్వ ప్రభుత్వం
3. 1978లో జనతా ప్రభుత్వం
4. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.

5. జోనల్ మండలి ఛైర్మన్ ఈ కింది వారిలో ఎవరు ?
1. భారత ఉపరాష్ట్రపతి
2. పదవీ రీత్యా హోదాలో ఘోంమంత్రి
3. భారత రాష్ట్రపతిచే నామ నిర్దేశం చేయబడిన కేంద్రమంత్రి
4. భారత ప్రధానమంత్రిచే నామనిర్దేశం చేయబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి భారత రాజ్యాంగం ఈ కింద చెప్పబడిన సందర్భలలో జరుగు వస్తువుల అమ్మకం లేదా కొనుగోళ్లపై ఒక రాష్ట్రంలోని ఏదేని శాసనం పన్నులను విధించరాదు లేదా విధించుటకు అధీకృత పరచరాదు?
ఎ. రాష్ట్ర అంతర్భా భూభాగంలో అవల జరిగేవి.
బి. భారత భూభాగం అవల జరిగే వస్తువుల ఎగుమతులు మరియు లోపల జరిగే వస్తువుల దిగుమతులు. పైన పేర్కొన్న వ్యాఖ్యలో ఏవి సరియైనవి.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ మరియు బి
4. ఎ కాదు మరియు బి కాదు

7. రాజ్యాంగం యొక్క “సంపూర్ణ విశ్వాసం మరియు ప్రతిష్ట” ఉప నిబంధన దేనికి వర్తింపచేయబడదు?
1. ప్రభుత్వ చట్టాలు
2. ప్రభుత్వ నమోదులు
3. న్యాయ వ్యవస్థ కార్యవ్యవహారాలు
4. పాలక సంఘాల యొక్క శాసనాలు

8. ఈ కింది వాటిలో దేని ద్వారా అంతర-రాష్ట్ర జల వివాదాలు పరిష్కరించబడతాయి?
1. భారత రాష్ట్రపతి ద్వారా నెలకొల్పబడిన ప్రత్యేక న్యాయస్థానాలు
2. పార్లమెంట్ చట్టం ద్వారా నెలకొల్పబడిన ట్రిబ్యునల్
3. కేంద్ర ప్రభుత్వం మాత్రమే
4. సుప్రీంకోర్టు మాత్రమే .

9. ఈ కింది వానిలో ఏది సరియైనది?
1. ప్రతి రాష్ట్రం యొక్క ప్రతి ప్రభుత్వ చర్యకు సంపూర్ణ విశ్వాసం మరియు గౌరవం ఇవ్వబడును.
2. సివిల్ న్యాయస్థానాల ఆదేశాల యావత్ దేశమంతా అమలు పరచబడతాయి. 3. రాష్ట్ర గవర్నర్, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధి కారం విస్తరించివున్న ఏదైన అంశమునకు సంబంధించి విధులను భారత ప్రభుత్వం సమ్మతించిన వరకు భారత ప్రభుత్వానికి అప్పజెప్పలేడు.
4. రాష్ట్ర గవర్నర్ అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారం విస్తరించి ఉన్న ఏదైన అంశమునకు సంబంధించిన విధులను భారత ప్రభుత్వానికి అప్పజెప్ప వచ్చును

1)1, 2)4, 3)4, 4)2, 5)2, 6)2, 7) 4, 8) 2, 9) 4,

అత్యవసర నిబంధనలు
1. నిబంధన 356 కింద రాష్ట్రపతి పాలన ఒక రాష్ట్రంలో చెల్లుబాటులో ఉండు అత్యధికాలం?
1. 4 సంవత్సరాలు
2. 3 సంవత్సరాలు
3. 2 సంవత్సరాలు
4. ఒక సంవత్సరం

2. ఎస్.ఆర్. బొమ్మయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
కేసులో తీర్పు విశాల భావంలో భారత రాజ్యాంగ ఏ నిబంధనకు సంబంధించినది?
1. నిబంధన 29
2. నిబంధన 32
3. నిబంధన 353
4. నిబంధన 356

3. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో, రాష్ట్ర జాబితాలో పొందపరిచబడిన అంశముపై పార్లమెంట్ చేసిన శాసనం, ఈ కింది ఏ పరిస్థితులలో అమలు నిలిపి వేయబడును?
1. అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రయోగం నిలిపివేసిన తర్వాత సంవత్సర కాలం గడిచిన అనంతరం.
2. పార్లమెంట్ ద్వారా తొలగించినపుడు
3. అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రయోగం నిలిపి వేసిన తర్వాత ఆరు నెలలు కాలవ్యవధి గడించిన అనంతరం
4. అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రయోగం నిలిపి వేయబడినప్పుడు

4. భారత రాజ్యాంగ నిబంధన 256కు లోబడి కేంద్రము ద్వారా జారీ చేయబడిన పాలన నిర్దేశాలను రాష్ట్రము అమలు
పరచనప్పుడు?
1. రాష్ట్రపతి, రాజ్యాంగ నిబంధన 352కు లోబడి అత్యవసర
పరిస్థితి విధించవచ్చును.
2. పార్లమెంట్, రాష్ట్రముకు చెప్పిన నిర్దేశమును
నిర్వహించమని బలవంతం చేయవచ్చును.
3. గవర్నర్, రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు
4. రాష్ట్రపతి, రాష్ట్రములో రాజ్యాంగ యంత్రాంగం విఫలం అయిందని భావించవచ్చును

5. ఎస్.ఆర్. బొమ్మయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు అర్థ వివరణను గవర్నర్ మంత్రి మండలిని లేదా ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయగలడు అని భావించవచ్చు?
ఎ. అతని అభిష్టం మేరకు, శాసన సభలో ముఖ్యమంత్రి సంఖ్యాబలంపై అతని విషయపర అంచనామీద
బి. శాసనసభ, మంత్రిమండలి విశ్వాసమును కొరుతూ ప్రకటించినపుడు
సి. మంత్రిమండలి యొక్క ఒక చర్య శాసనసభలో వీగిపోయినప్పుడు
డి. మంత్రి మండలి వ్యతిరేక అభిశంసన తీర్మానం శాసనసభలో తిరస్కరించబడినప్పుడు ఈ పైన వ్యాఖ్యలలో ఏవి సరైనవి
1. ఎ మరియు బి
2. బి మరియు సి
3. సి మరియు డి
4. డి మరియు ఎ

6. కేబినెట్ యొక్క రాత పూర్వక సలహామేరకు మాత్రమే భారత రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటన చేయగలరు. ఈ నిబంధన చేర్చబడింది?
1. భారత రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా
2. 1975 భారత సుప్రీంకోర్టు ద్వారా
3. 42వ రాజ్యాంగ సవరణ తర్వాత
4. 44వ రాజ్యాంగ సవరణ తర్వాత

7. ఈ కింది వానిలో ఏది ఆర్థిక అత్యవసర పరిస్థితి కారణంగా తనంతట తానే ఏర్పడే పర్యవసానం కాదు?
1. పార్లమెంట్ అధికారము రాష్ట్ర జాబితాలోని అంశముపై శాసనము చేయుటకు విస్తరింప జేయడం
2. నిబంధన 19న తాత్కాలికంగా రద్దు చేయడం
3. నిబంధన 20 మరియు 21 ద్వారా కల్పించిన వాటికిమినహాయించి అన్ని ప్రాథమిక హక్కులు అమలును తాత్కాలికంగా నిలిపివేయడం
4. కేంద్ర కార్యనిర్వాహక వర్గ అధికారము, రాష్ట్రాలకు వాటి కార్యనిర్వహణ వర్గ అధికారమునకు వినియోగించుతీరును నిర్దేశించు వరకు విస్తరింపును. ప్రతిపాదన
(ఎ) : అత్యవసర పరిస్థితి ప్రకటనకు అసన్న యుద్ధ ప్రమాదం లేదా బాహ్య దూరాక్రమణ సరిపోవు.
హేతువు (ఆర్) : అత్యవసర పరిస్థితి ప్రకటన పార్లమెంట్ ఉభయ సభలచే ఆమోదించ బడనట్లయితే ఒక నేల కాల పరిమితి ముగియగానే దాని అమలు నిలిచిపోవును.
కోట్లు :
1. ఎ మరియు ఆర్ రెండు విడివిడిగా సరైనవి మరియు ఆర్, ఎ కు సరైన వివరణ
2. ఎ మరియు ఆర్ రెండూ విడివిడిగా సరైనవి కాని ఆర్,ఎ
కు సరైన వివరణకాదు.
3. ఎ సరైనవి కాని ఆర్ తప్పు
4. ఎ తప్పు కాని ఆర్ సరైనవి

9. ఈ కింది వానిలో ఏవి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రకటన
పర్యవసానాలు కాకపోవచ్చు?
ఎ. రాష్ట్రంలో మంత్రి మండలిని తొలగించడం
బి. రాష్ట్ర శాసనసభ రద్దు
సి. రాష్ట్ర పరిపాలనను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం
డి. స్థానిక సంస్థలను తొలగించడం
1. ఎ మరియు బి
2. బి మరియు సి
3. సి మరియు డి
4. ఎ మరియు డి

10. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సందర్భంలో?
1. రాష్ట్రపతి, రాష్ట్రాలకు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి అవసరమని భావించిన మరియు అధికారుల జీతాలను తాత్కాలికంగా తగ్గించడానికి ఆదేశాలను చేయవచ్చును?
2. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయబడతాయి మరియు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను స్వాధీనం పరుచుకొనును.
3. రాష్ట్రాల అన్ని ఆర్థిక బిల్లులు పార్లమెంట్ చే మాత్రమే పరిశీలించబడును మరియు ఆమోదించబడును
4. రాష్ట్ర శాసన సభలన్నింటినీ సుప్తావస్త దశలో ఉంచబడును మరియు రాష్ట్ర జాబితా అంశాలపై పార్లమెంట్ శాసనం చేయును.

11. నిబంధన 356 లోబడి ఒక రాష్ట్రములో అత్యవసర పరిస్థితి ఒక సంవత్సరానికి పైబడి కొనసాగు సందర్భం?
1. రాష్ట్ర గవర్నర్ శాంతి మరియు భద్రతల పరిస్థితి నియంత్రణలో లేదని దృవీకరించినప్పుడు
2. రాష్ట్ర హైకోర్టు, రాష్ట్రంలో పరిస్థితి తీవ్ర అపాయకరంగా ఉందని ధృవీకరించినప్పుడు
3. రాష్ట్రపతి, రాష్ట్ర ఘోర పరిస్థితిని గురించి స్వతంత్ర్య పరిశోధన ద్వారా సంతృప్తి చెందినపుడు
4. ఎన్నికల సంఘం, శాసనసభకు ఎన్నికలు నిర్వహించడం కష్టం అని ధృవీకరించినపుడు

1)2, 2)4, 3)3, 4)4, 5)2, 6)4, 7)3, 8)4, 9)2, 10)1, 11)4