యూనియన్ & దాని భూభాగం – Indian Polity Online Mock Test in Telugu

Click Here To Start Quiz

యూనియన్ & దాని భూభాగం - Indian Polity Mock Test

All The Best

1. ఈ కింది వారిలో ఎవరు జవహర్ లాల్ నెహ్రూ నియమించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్.ఆర్.సి) సభ్యుడు కాదు?
1. పొట్టి శ్రీరాములు
2. హృదయనాథ్ కుంజు
3. జస్టిస్ ఫజల్ అలీ
4. కె.ఎం.ఫణిక్కర్

2. భారతదేశంలోని ఒక రాష్ట్ర సరిహద్దును మార్చే విధానము ఈ కింది ఏ నిబంధనలో పొందు పరచబడినది?
1. నిబంధన 3
2. నిబంధన 368
3. నిబంధన 4
4. నిబంధన 130
3. భాష ప్రయుక్త ప్రావిన్సుల వాంఛనీయత విచారణకు 1948లో నియమించబడిన భాషా ప్రయుక్త ప్రావిన్సుల కమిషన్ అధ్యక్షులు ఈ కింది వారిలో ఎవరు?
1. జవహర్‌లాల్ నెహ్రూ
2. పట్టాభి సీతరామయ్య
3. జస్టిస్ ఫజల్ అలీ
4. జస్టిస్ ఎస్.కె. థార్

4. స్వాతంత్ర్య భారతదేశంలోని భాషా ప్రాతిపదిక రాష్ట్రాల పునర్వవ్యస్థీకరణ దృష్ట్యా ఈ కింది వానిలో సరియైనది ఏది?
ఎ. తెలుగు ప్రజలకొరకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము 1953 సంవత్సరము నుండి మనుగడలోకి వచ్చింది.
బి. ఆంధ్ర ఉద్యమ విజయం మేల్కొలుపుతో వచ్చిన భాషా ప్రాతిపదిన రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ ఉద్యమాలకు జవహర్ లాల్ నెహ్రూ ప్రత్యేకంగా మద్దతునిచ్చారు.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ మరియు బి
4. ఎ కాదు మరియు బి కాదు

5. ఈ కింది వాటిని భారత యూనియన్ దృష్ట్యా పరిశీలించుము?
ఎ. నాగాలాండ్ రాష్ట్ర ఏర్పాటు
బి. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం
సి. హర్యానా రాష్ట్ర ఏర్పాటు
డి. గుజరాత్ రాష్ట్ర ఏర్పాటు
పై వాని యొక్క సరియైన కాలక్రమానుసారం ఏది?
1. డి, బి, సి, ఎ
2. బి, డి, సి, ఎ
3. డి, బి, ఎ, సి
4. బి, డి, ఎ, సి

6. భారత పార్లమెంట్ వీటిని ఏర్పాటు చేయుటకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంను 1956 ఆమోదించింది?
1. 24 రాష్ట్రాలు మరియు 9 కేంద్ర పాలిత ప్రాంతాలు
2. 16 రాష్ట్రాలు మరియు 3 కేంద్ర పాలిత ప్రాంతాలు
3. 15 రాష్ట్రాలు మరియు 5 కేంద్ర పాలిత ప్రాంతాలు
4. 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్ర పాలిత ప్రాంతాలు

7. 1950లో భారత రాజ్యాంగం భారతదేశ రాష్ట్రాలను ఎ,బి,సి మరియు డి అను రకాలుగా విభజించింది. ఈ సందర్భంలో ఈ కింది వాటిలో సరియైన వ్యాఖ్యం ఏది? –
1. ఎ రకం రాష్ట్రాలకు ప్రధాన కమిషనర్ కార్య నిర్వాహణ అధిపతి. బి రకం రాష్ట్రాలకు రాజ ప్రముఖ్ కార్యనిర్వాహణ అధిపతి. సి&డి రకం రాష్ట్రాలకు గవర్నర్ కార్యనిర్వాహణ అధిపతి.
2. ఎ రకం రాష్ట్రాలకు రాజప్రముఖ కార్యనిర్వాహణ అధిపతి. బి & సి
రకాల రాష్ట్రాలకు ప్రధాన కమిషనర్ కార్యనిర్వాహణ అధిపతి. ఓ రకం రాష్ట్రాలకు గవర్నర్ కార్యనిర్వహణ అధిపతి.
3. ఎ రకం రాష్ట్రాలకు గవర్నర్ కార్యనిర్వాహణ అధిపతి. బి రకం రాష్ట్రాలకు రాజ్ ప్రముఖ కార్యనిర్వాహణ అధిపతి. సి& డి రకం రాష్ట్రాలకు రాజప్రముఖ కార్యనిర్వాహణ అధిపతి.
4. ఎ రకం రాష్ట్రాలకు గవర్నర్ కార్యనిర్వాహణ అధిపతి. బి రకం రాష్ట్రాలకు రాజ్ ప్రముఖ కార్యనిర్వాహణ అధిపతి. సి మరియు డి రకం రాష్ట్రాలకు ప్రధాన కమిషనర్ కార్యనిర్వహణ అధిపతి.

8. ఈ కింది వానిలో సరియైనది ఏది?
ఎ. భారతదేశంలోని మనుగడలో గల ఏదైన రాష్ట్ర సరిహద్దులను మార్చే ఒక బిల్లును రాజ్యసభలో మాత్రమే ప్రవేశ పెట్టాలి మరియు దానిని భారత రాష్ట్రపతి
సలహామేరకు మాత్రమే ప్రవేశపెట్టాలి.
బి. పార్లమెంట్ భారతదేశంలోని మనుగడలో గల ఏ రాష్ట్ర సరిహద్దును అయినా మార్పుల చేసే అధికారమును కలిగి ఉంది.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ మరియు బి
4. ఎ కాదు & బి కాదు

9. ఈ కింది భారత యూనియన్ రాష్ట్రాలు ఏర్పడిన లేదా సంపూర్ణ రాష్ట్ర హోదా పొందిన సరియైన కాల క్రమానుసారం ఏది?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. హర్యానా
సి.నాగాలాండ్
డి.మహారాష్ట్ర

1. ఎ,డి,సి,బి
2. బి,సి,డి,ఎ
3. సి, డి,ఎ,బి
4. డి,ఎ,బి,సి

10. భారత యూనియన్ యొక్క రాష్ట్రాలను దేని ద్వారా పునర్వీవస్థీకరించి వచ్చును లేదా వాటి సరిహద్దులలో మార్పులు చేయచ్చును?
1. పార్లమెంట్ ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజారిటీతో
2. కేంద్ర పార్లమెంట్ సాధారణ శాసన ప్రక్రియలో సాధారణ మెజారిటీతో
3. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహణ ఆదేశంతో
4. పార్లమెంట్ ఉభయ సభలలో ముడింట రెండు వంతుల మెజారిటీ & సంబంధిత రాష్ట్ర శాసనసభ సమ్మితితో.

1)1, 2)1, 3)4, 4)1, 5)4, 6)4, 7)4, 8)2, 9)1, 10)2