పార్లమెంటరీ వ్యవస్థ – The Parliamentary System In India Study Material And Practice Bits in Telugu

1. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రులు వీరి చేత
నియమింపబడతారు?
1. రాజ్యా ధిపతి, అతని విచక్షణతో
2. ప్రభుత్వా ధిపతి
3. శాసన వ్యవస్థ
4. ప్రభుత్వాధిపతి సలహా మేరకు రాజ్యా ధిపతి.

Answer : 4

2. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రిమండలిలోని
సభ్యులందరూ సమిష్టగా వీరికి బాధ్యులు?
1. ప్రధానమంత్రి
2. పార్లమెంట్ యొక్క ప్రజామోద సభ
3. రాజ్యా ధిపతి
4. ఎగువసభ ఛైర్మన్ మరియు దిగువ సభ స్పీకర్

Answer : 2

3. ఈ కింది వాటిలో ఏవి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణాలు?
ఎ. నామమాత్రపు రాజ్యాధిపతిని కల్గి ఉండటం
బి. అధికారాల వేర్పాటు
సి. శాసనసభకు, కార్యనిర్వహక వర్గ జవాబుదారీతనం
డి. క్యాబినెట్ యొక్క సమిష్టి బాధ్యత
1. ఎ,బి మరియు సి
2. ఎ,సి మరియు డి
3. ఎ, బి మరియు డి
4. బి, సి మరియు డి

Answer : 1

4. ఈ కింది వాటిని జతపరచండి ప్రభుత్వ తరహాలు లక్షణాలు
1. పార్లమెంటరీ ప్రభుత్వం ఎ. అధికార కేంద్రీకరణ
2. అధ్యక్ష ప్రభుత్వం బి. అధికారాల విభజన
3. సమాఖ్య వ్యవస్థ సి. అధికారాల వేర్పాటు
4. ఏకకేంద్ర వ్యవస్థ డి. సమిష్టి బాధ్య త
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

Answer : 4

5. ఈ కింది వానిలో ఏది పార్లమెంటరీ వ్యవస్థకు అవశ్యకము
కాని లక్షణము?
1. సమిష్టి బాధ్య త
2. నామమాత్రపు రాజ్యాధిపతి
3. కార్యనిర్వాహక వర్గం యొక్క నిర్ణీత వ్యవధి పదవీకాలం
4. శాసన వ్యవస్థ మరియు కార్యనిర్వాహణ వర్గ సమ్మేళనం

Answer : 3

6. కాబినెట్ తరహా ప్రభుత్వంలో, సాధారణంగా కాబినెట్
పదవీకాలం?
1. నిర్ణీత కాలం వరకు
2. శాసన వ్యవస్థలో ప్రజామోదసభ విశ్వాసాన్ని పొందినంత కాలం.
3. ఇది ఓటరుల విశ్వాసాన్ని పొందినంత కాలం
4. ఇది రాజ్యాధిపతి విశ్వాసాన్ని పొందినంత కాలం.

Answer :2

7. భారత రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వంను
ఏర్పాటు చేసింది మరియు ఈ తరహా ప్రభుత్వం సారాంశం ఏమిటంటే వీరికి అది బాధ్యత వహిస్తుంది?
1. ప్రధానమంత్రి
2.శాసనసభ
3. అధ్యక్షుడు
4. భారత ప్రజలు

Answer : 2

8. భారతదేశంలోని పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వం
నిర్వహించబడుతుంది?
ఎ. నామమాత్రపు కార్య నిర్వహక అధిపతి
బి. ఎగువసభ ఛైర్మన్ గా ఉపరాష్ట్రపతి
సి. మంత్రిమండలితో నిజ కార్యనిర్వాహక అధికారం
డి. దిగువ సభకు కార్యనిర్వాహక శాఖ భాద్యత
1. ఎ,బి మరియు డి
2. ఎ,బి మరియు సి
3. ఎ,సి మరియు డి
4. బి, సి & డి

Answer : 3

DOWNLOAD PDF